శనిదోష నివారణ స్తోత్రాలు

శనీశ్వరుడు కర్మఫలదాత, మనం చేసుకొన్న కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఇతనిని న్యాయనిర్ణేత గా చెప్తారు.అన్యాయముగ. అధర్మముగా ప్రవర్తిచిన వారిని శిక్షించటం లో శనీశ్వరునకు ప్రత్యేక స్థానం ఉంది. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధి రూపం లో కాని, ఇంటి సమస్యల రూపం లో, చేయు పని లేదా ఉద్యోగం లో కాని, వ్యాపారం లో కాని, కెరిఎర్ లో కాని శనీశ్వరుడు ఇబ్బందులను కలిగిస్తాడు ఇలా   అందరికి జరగాలని ఏమిలేదు ఎవరి జతకములో శనీశ్వరుడు  నీచ స్థితిలో ఉంటాడో వారికీ మాత్రం చేసిన పాప పుణ్యాలను బట్టి ఇబ్బందులను కలిగిస్తాడు. అట్లానే శనీశ్వరుని చే ఇబ్బందులను ఎదుర్కన్నవారు నీతి నియమాలతో, ధర్మంగా జీవిస్తారు. సమయములోనే ఎవరు తనవారు, ఎవరు పరాయి వారో కూడ తెలుస్తుంది.

శనీశ్వరుని తీవ్ర భాదలనుండి ఉపశమనం పొందటానికి నిత్యం పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము, శని సప్తనామావళి ని చదివిన లేదా వినిన కొంత ఉపశమనం పోందవచ్చు

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము

            శ్లోకం||   నమస్తే కోణ సంస్థాయ, పింగళాయ నమోస్తుతే

                        నమస్తే బభ్రు రూపాయయ, కృష్ణాయచ నమోస్తుతే

            శ్లోకం||   నమస్తే రౌద్ర దేహాయ నమస్తే చాంతకయచ

                        నమస్తే యమ సంజ్ఞయా నమస్తే సౌరయే విభో

            శ్లోకం||   నమస్తే మంద సంజ్ఞయా శనీశ్చర నమోస్తుతే

                        ప్రసాదం మమ దేవేశ, దీనస్య ప్రణతస్యచ

శని సప్తనామావళి

                        నమో శనేశ్వర పాహిమాం

                        నమో మందగమనా పాహిమాం

                        నమో సూర్యపుత్రా పాహిమాం

                        నమో ఛాయాసుతా పాహిమాం

                        నమో జ్యేష్టాపత్ని సమేత పాహిమాం

                        నమో యమప్రత్యది దేవా పాహిమాం

                        నమో గృద్ర వాహాయ పాహిమాం

            ఫై స్తోత్రాలతో పాటు కింద తెలిపిన రెమెడీస్ ని తమ సమయాని, శక్తి ని బట్టి పాటిస్తే శనీశ్వరుని బాధలనుంచి విముక్తి పోందవచ్చు

శనివారం నాడు ఒకటింపావు కిలో నల్లనువ్వులు దానంఇవ్వాలి. కాలభైరవ అష్టకం చదవాలి, శనీస్వరునకు నడవటం అంటే ఇష్టం కావునప్రతి రోజు మార్నింగ్ వాక్ తో ప్రరంభిచాలి, నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని బట్టలుపేదవారికి ఒకొక్క శనివారం దానం చేయాలి. ఏలినాటి శని ప్రభావం తగ్గటానికి రోజు కాకులకు అన్నం పెట్టాలి, రావులపాలెం (పూర్వపు తూర్పు గోదావరి జిల్లా) దగ్గరలోని మందపల్లి లో ఉన్న శనిస్వరునకి తైలాభిషేకం చేయాలి, ఎప్పుడు అబద్దాలు అడకుడదు, భార్య పిల్లాతో ఎక్కువ సమయం కేటాయిoచాలి. ఎక్కువగా సాయంకాలంలోశివాలయ దర్శనం, శివ అభిషేకo చేయాలి. శనిత్రయోదశి రోజున శనిస్వరునకి తైలాభిషేకం చెయిoచు కొనవలెను.