పూజకు ఉపయోగించే పూల రంగులు – ఫలితములు

దేవుని పూజకు ఉపయోగించే పూల రంగులు – ఫలితములు

          మన కోరికలు తీరటానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి రోజు మనమందరం ఉదయం పూట భగవంతునికి రకరకాల పూలతో పూజ (అర్చన) చేస్తాం. పూలు అన్ని వివిధ రoగులలో దొరుకుతాయి కదా. ముఖ్యంగా కొన్ని రంగుల పూలతో భగవంతున్ని గనుక పూజిస్తే విసేషమైన యిన ఫలితం వస్తుంది.ఆ రంగుల పుష్పా ల గురుంచి తెలుసుకొందాం.

ద్రవ్యము పేరు                                                      ఇచ్చు ఫలితము

తెల్లన్ని పూలు                                   ధర్మబద్ధ కోరికలు తీరును, మానసిక ప్రశాంతత

పసుపు పచ్చని పూలు                         అష్టైశ్వర్యములు కలుగును. గురు గ్రహ అనుగ్రహం

ఎర్రని పూలు                                     సంపదలు కలుగును, మోక్ష ప్రదము, అమ్మ దయ ఉండును

నల్లని పూలు                                    శత్రు నాశనముఅగును, శనీశ్వర అనుగ్రహం

ఏ రంగు పూలతో పూజించినాను స్త్రీలకు ఐదవ తనము పెరుగును, శక్తీ ఉన్న యడల 108 బంగారు పూలతో పూజించి నను రాజసుయగము చేసిన ఫలితము వచ్ఛును.  ప్రతి 108 రోజు పూలతో పూజించినాను ఆ ఫలితము చెప్పనలవి కాదు.

ఇక్కడ పూజ ఏ రంగు పూల తో చేశామన్నదానికన్న ప్రశాoతమైన మనసు తో చేసిన పూజకు ఫలితం ఎక్కువ అని గమనిచగలరు.

పూజకు పనికి రాని పూలు

            మొగలి, గానుగ , మ౦కెన పురుగులు పట్టిన, రేఖలు ఊడిన, మాడిన, వదలిన, వాసనా చూచిన, దొంగాలించినవి, చిల్లులు పడినవి, దేవతా స్తలములులలోని పూలు పూజకి పనికిరావు.

త్రికాల పూజ కి ఉపయోగించే పూలు

ఉదయం పూజకు:- తామర, మందార, సంపెంగ, పున్నాగ, మోథుగ, ఎర్రకలవపూలు, మారేడు, తులసి

మధ్యాయన్నపూజకు:- తెల్ల తామర, కరవీరము, మోదుగ, తులసి, తెల్ల కలువ, బిల్వములు, ఎర్రకలువ

రాత్రి పూజకు:- ఎర్రకలువ, కలువ, మల్లె, జాజి, మాలతి, గన్నేరు, దవనము,