మాఘ మాసము – మాఘ పౌర్ణిమ

మన సనాతన ధర్మం లో ప్రతి మాసానికి ఒక ప్రత్యకత ఉన్నది. చైత్ర మొదలు ఫాల్గుణం వరకు ప్రతి మాసం యందు విశేష తిధులు (రోజులు) ఉన్నాయి. కార్తిక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత మాఘ మాసానికి ఉంది. ధ్యానం మనస్సు ను శుద్ధి చేస్తే స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. కార్తీక మాసములో దీపారాధనకు ఒక ప్రత్యేకత ఉంది, అదే ఈ మాఘ మాసంలో స్నానమునకు ప్రత్యేకత ఉంది. సంకల్ప సహితంగా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేస్తే మనం శరీరంతో చేసిన పాపలు తొలగుతాయి. కార్తీక మాసంలో అందరి దేవతలతో పాటు శివుని ఎక్కువగ పూజిస్తారు అదేవిధంగ ఈ మాఘ మాసంలో చవితి నాడు గణపతిని, పంచమి నాడు సరస్వతిని (శ్రీ పంచమి) షష్ఠి నాడు సుబ్ర్హ్మమణ్యని (స్కంద షష్టి) సప్తమి నాడు లోకoలోని సమస్త జీవులకు ఆయురరోగ్యాలను ప్రసాదించే సూర్య భగావనుడుని (రధసప్తమి), అష్టమి రోజును భీష్మ అష్టమి అని, ఏకాదశి, (భీష్మ ఏకాదశి) ద్వాదశి నాడు విష్ణు మూర్తి ని, పౌర్ణిమ రోజున శక్తిని (అమ్మవారిని) పూజిస్తారు ఇక త్రయోదశి రోజున ఆ ఆది దేవుడైన శివునకు ఇష్టమైన (మాసశివరాత్రి, మహాశివరాత్రి) అభిషేకo తో పూజిస్తాము. ఇలా ఈ మాసమంతా శివునకు, విష్ణవునకు, అమ్మవారికి విశేషంగా ఆరాధిస్తాము. ప్రతి మాసములో వచ్చే పౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుంది అంటే ఆమాస ఫలితం అంత ఆ పౌర్ణమి లో ఇమిడి ఉంటుంది అందుకనే ఆషాడ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కార్తిక పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజుల్లో విశేషoగా అమ్మవారిని అర్చిస్తుంటాము ఇలా పౌర్ణమి రోజుల్లో చేయటం వలన మాస ఫలితం, మనశాంతి వస్తుందని మన పెద్దలు చెప్పియున్నారు.

మాఘ పౌర్ణిమ  మఖనక్షత్రం పౌర్ణమి రోజున ఉంటుంది కాబట్టి ఈ మాసమును మాఘ మాసము అంటారు. కార్తీక మాసములో దీపారాధనకు ఎంత ఫలితము వస్తుందో మాఘమాసములో చేసే స్నానికి అంత ఫలితము వస్తుంది. అయితే ఈ మాఘ స్నానాన్ని సంకల్పసహితముగా చేయాలి నదీ స్నానము కాని, సముద్ర స్నానము కాని, సరస్సు లో నయన చేయవచ్చు అయితే ప్రస్తుత పరిస్థితులలో పైన చెప్పినట్లు చేయటానికి వీలు లేకపోవచ్చు అప్పుడు కనీసము ఇంట్లో అయిన సంకల్ప సహితముగా స్నానం చేయాలి. ఇక్కడ అందరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, అదేమిటంటే నదీ స్నాన్నం కాని సరస్సు స్నానం రోజు లేదా ఎప్పుడైన చేయవచ్చు, కాని సముద్ర స్నానం ప్రత్యేకమైన (తిధులలో) రోజుల్లో మాత్రమే చేయాలనీ శాస్త్రము చెపుతున్నది. ఆ తిధులు ఏమిటంటే ఆషాడ పౌర్ణమి, కార్తిక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి (ఆ, కా, మ, వై) లలో మాత్రమే చేయాలి.సముద్ర స్నానాన్ని చేయటకు ముందు విధిగా ఇంట్లో స్నాము చేయాలి, సముద్ర తీరానికి వచ్చి సంకల్పం చెప్పుకొని  స్నానము చేయాలని శాస్త్రము చెపుతున్నది.

సంకల్పం కింది విధముగా చెప్పుకొవచ్చును

శ్రీ గురుభ్యోం నమ:, శ్రీ మహ గణాధిపతయే నమ:

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన……..సంవత్సరే….అయనే….ఋతౌ…..మాసే, శుక్ల/కృష్ణ పక్షే ….తిథౌ….వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్….గోత్రః …..నామధేయోహం, మమ ధర్మ పత్నీసమేతస్య, సహా కుటుమ్బానాం క్షేమ, స్తేర్య, విజయ, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యవ్రుధ్యర్థం, భగవంతం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత ప్రీత్యర్ధం మాఘ స్నానం కరిష్యే (నీరు ముట్టుకోవలెను) అని చుప్పుకోవాలి

గమనిక: సంకల్పం ఆయా కుటుంబ వేదములను బట్టి మరియు కటుంబ ఆచార సంప్రదయలను బట్టి మారును.

మాఘమాసము మొత్తం స్నానము చేయలేని వారు కనీసం పౌర్ణమి రోజు నైన  సముద్రములో కాని, నదీ లో కాని, సరస్సు లో కాని, నీటి ప్రవాహమున్న కాలువ లో కాని సంకల్ప సహితముగా స్నానము చేసిన మంచి ఫలితము ఉంటుంది.

చదవవలసిన స్తోత్రాలు : విష్ణు సహస్ర నామము, లలితా సహస్రనామ స్తోత్రం

దానాలు : శక్తి మేర బియ్యం, నువ్వ్యలు బెల్లం తో చేసిన ఉండలు