శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాల

ముగ్గురమ్మల (పార్వతి, లక్ష్మి, సరస్వతి) మూలపుటమ్మ దుర్గా దేవి. దిర్గా దేవిని ఆరాధించడం వలన సర్వ దుఃఖాలు తొలగి పోతాయి. లోకం లో ప్రతి తల్లి తన పిల్లలను ఎలా కాపాడునో ఈ తల్లి కూడా లోకం లోని సర్వ ప్రాణులను తన పిల్లలాగ చూసుకొన్టున్ది. దుర్గ అంటే దుర్గాతులనుండి  కాపాడేది. దుర్గా దేవి ని ఆరాధించడం వలన మానవులకు సమస్త దుర్గతుల నుండి రక్షణ ని ఇస్తుంది.  సర్వ దేవతల సరుపమే దుర్గ దేవి.  దేశమంతటా శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. మన రాష్ట్రంలో విజయవాడ లో ఉన్న ఇంద్రకీలాద్రి ఫై  శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. అలాగే కొలకత్తా లో శరన్నవరాత్రులో భాగంగా దుర్గ దేవి ని కాళీ మాతగా భక్తులు  పూజిస్తారు. ఈ ఉత్సవాలకు యునెస్కో వారి నుంచి కూడా గుర్తింపు వచ్చింది. కోటి సూర్యులతో ప్రకాశించే అమ్మవారి పాదాలను అర్చిస్తే సకల పాపములు హరించి అష్టఐశ్వర్యములు ప్రాప్తిస్తాయి. విశేషము ఏమిటంటే తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రులు ఒకే సారి ప్రారంభమవుతాయి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే అత్యంత ప్రీతి. అమ్మవారిని ఎరుపు రంగు పూలతో, ఎర్రని వస్త్రంతో , ఎర్రని గాజులు, ఎర్రని అక్షాన్తలతో పూజించాలి. అందుకే దుర్గ దేవి దీక్ష తీసుకొన్నవారు  ఎర్రని వస్త్రాలు ధరిస్తారు. ఇప్పటికి ఇంద్రకీలాద్రి (కొండ) ఫైన అమ్మవారు తిరుగుతుంటారు అని భక్తుల నమ్మకం. రాహు గ్రహ దోష నివారణకు అమ్మవారిని పూజించిన మంచి ఫలితాలు వస్తాయి. దుర్గ దేవి ని పూజించటం వలన గణపతి, కుమారస్వామి, శివ, సూర్య చంద్రులను, పూజించినట్లే ఇంద్రకీలాద్రి ఫై ఉన్నఅమ్మవారి విగ్రహాన్నిమనసుతో చుసిన మనకు ఈ విషయం అర్థమవుతుంది.  తోటి జీవుల యందు ప్రేమ అనురాగంతో ఉంటూ నిత్యం ఓం శ్రీ దుర్గాయై నమ: అని మనస్సులో తలచుకొన్న చాలు  అమ్మ వారు ఏదో ఒక రూపంలో వచ్చి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాల

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణి

దుర్గామచ్చేధినీ దుర్గసాధినీ దుర్గనాశినీ

ఓం దుర్గాతోర్ధారిని దుర్గనిహంత్రీ దుర్గమాపహా

ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక దవానలా

ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి

ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా

ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ

ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ద స్వరూపిణీ

ఓం దుర్గ మాసుర సంహoర్త్రీ దుర్గమాయుధధారిణి

ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ

ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ

నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః

పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

ధనుంజయ కృత శ్రీ దుర్గ స్తుతి కొరకు  ధనుంజయ కృత శ్రీ దుర్గ స్తుతి