కలియుగం లో మానవులు చేసిన పాపాలు అన్నింటిని హరించే శక్తి ఆ శ్రీ హరి కి ఉన్నది. ఆ ఆపద మొక్కులవాడు మన ఆపదలను తొలగించి మనలోని చక్రాలను ఉత్తేజ పరిచి, మన ఆలోచనలను సక్రమ మార్గములో పెట్టి మన ఆపదలను తొలగిన్చటానికి ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ చాలా ఉపయోగ పడుతుంది అనుటలో అతిశయోక్తి లేదు
నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం|
ప్రపధ్యే వేంకటేశాఖ్యం తదేవకవచం మమ|| 1
సహస్ర శీర్షాపురుషో వేంకటేశ శ్సీరోవతు|
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణo రక్షతుమే హరి: || 2
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు |
దేవ దేవోత్తమః పాయా ద్దేహం మే వేంకటేశ్వర: || 3
సర్వత్ర సర్వకార్యేషు మoగాంబాజాని రీశ్వరః |
పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు || 4
య ఏతత్ వజ్ర కవచ మభేద్యం వేంకటేశ్వర: |
సాయం ప్రాతః పఠేనిత్యం మృత్యు:తరతి నిర్భయ: || 5