Dhanadha Devi Stotram

ధనధా దేవి స్తోత్రం DhanaDha Devi Stotram

Dhanadha Devi

ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు, ప్రస్తుత కాలంలో ధనం ఉంటే సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు, ఆదరణ అనేవి ఉంటాయి, ధనం సంపాదించాలంటే కష్టం తో పాటు, ద్య్వానుగ్రహం కుడా ఉండాలి. ఈ  ధనదాదేవి స్తోత్రాన్ని సాక్షాత్ శంకరుడే పార్వతీ మాతకు చెప్పెను. భక్తి శ్రద్ధలతో నిత్యం త్రికాలములో ధనదాదేవి స్తోత్రాన్ని పటించే వారికి ధన, కనక, వస్తు, వాహనాలతో పాటు సంగములో గౌరవం కుడా లభించును, ముఖ్యంగా సమస్త గ్రహ బాధలు తొలగి మానసిక ప్రశాంతత లభించును.

ధనధా దేవి స్తోత్రం

నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే |
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే |
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి |
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే |
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి |
మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతే||

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే |
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే||

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే |
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ||

ఇతి శ్రీ ధనదా దేవి స్తోత్రం సంపూర్ణం ||