వసంత పంచమి

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుపిణి

విధ్యారంభం కరిష్యామి సిద్ది: ర్భవతుమే సదా

మనకు ఏది కావాలన్న, ఏది సాధించాలన్న, ఏ మార్గాన్ని చేరాలన్న జ్ఞానం అన్నది చాలా ముఖ్యం, జ్ఞానార్జన కొరకు మానవలు, మునులు, ఋషులు, దేవతలు ఒక్కమాటలో చెప్పాలంటే సమస్త బ్రహ్మాండం నిత్యం సాధన చేస్తూనే ఉంటారు.ఆది మానవుడు నుండి నేటి ఆధునిక మానవుడి వరకు నిత్యం జ్ఞానార్జన కొరకు శ్రమించాల్సిందే (కోటి విద్యలు(జ్ఞానం) కూటి కొరకు),  ధనార్జన చేయాలంటే ఖచితంగా జ్ఞానార్జన చేయవసిందే. జ్ఞానార్జన కొరకు గురువు ద్వారా చదువుల తల్లి అయిన సరస్వతి అమ్మవారిని వేడుకొంటారు. దుర్గా నవరాత్రులలో మూల నక్షత్రం రోజున సరస్వతీ అమ్మవారిని పూజిస్తాం ఇలా చేయటం వలన మనలోని రాక్షసత్వం నశించి మంచి జ్ఞానం వస్తుంది.  సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే మనకు కావల్సిన రూపంలో అమ్మవారు మానని అనుగ్రహిస్తుంది. (సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుపిణి) సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, కాని సరస్వతి అమ్మవారి చేతిలో ఏ ఆయుధము  ఉండదు చేతిలో పుస్తకము, వీణ మాత్రమే ఉంటాయి. దీన్నిబట్టి మనకు తెలిసె విషయం ఏమిటంటే జ్ఞానులు నిర్మలంగాను, ప్రశాంతం గాను ఉంటారు, వారి జ్ఞానమే అతి పెద్ద ఆయుధం.

వసంత పంచమి – శ్రీ పంచమి

            మాఘశుద్ధ పంచమి నే వసంత పంచమి లేదా శ్రీ పంచమి అనికూడ అంటారు. ఇక్కడ మన పెద్దలు వసంత పంచమి లేదా            శ్రీ పంచమి అని చెప్పుటలో ఒక అంతరార్ధం దాగి ఉన్నది అదేమిటంటే

వసంత పంచమి: వసంత ఋతువు చైత్ర మాసములో వస్తుంది కాని మనం ఈ చదువుల పండగ మాఘ మాసములో  చేసుకొంటాం కదా అంటే  మాఘశుద్ధ పంచమి రోజున మనం సరస్వతి అమ్మవారిని జ్ఞానం కోసం, విద్య కోసం ప్రార్థిస్తాం, ఎవరికైతే అమ్మదయతో జ్ఞానం వస్తుందో వారు వసంత రుతువులో ప్రకృతి వలె ఆహ్లాదకరంగా (అంతే ఆనందం గా) ఉంటాడు, అందుకే ఈ రోజును వసంత పంచమి గా పిలుస్తారు.

శ్రీ పంచమి: శ్రీ అంటే సంపద, సంపద ని ప్రసాదించేది  లక్ష్మిదేవి. సరస్వతి దేవి ని లక్ష్మిదేవి గ పూజిస్తారో వారికీ థనార్జనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఇక్కడ ఇంకోవిషయం ముంది శ్రీ అంటే  మూడు శక్తుల కలయిక (ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి) అని అర్థం అట్టి త్రిశక్తి స్వరూపాన్ని పూజిస్తారో అట్టివారికి అమ్మదయ ఉంటుంది. అమ్మ దయ ఉంటె అన్ని ఉన్నట్లే.

వసంత పంచమి – శ్రీ పంచమి రోజున మనం ముక్యంగా సరస్వతిని పూజించి, పేదవారి పిల్లలకు అక్షరాబ్యాసం చేయిoచాలి, అలానే చదువుకోనే పేద పిల్లలకు శక్తి మేర పుస్తక, దానం చేయాలి, వేద పండితులకు తెల్లని బట్టలు దానం చేయాలి. ఇవి చేయటం కుదరక పోతే ప్రశాంత మైన మనస్సు తో శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రమ్ ను చదవాలి.

 శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రమ్

సరస్వతీ త్వియం దృష్టా వీణాపుస్తక థారిణీ

హంసవాహసమాయుక్తా విధ్యాదానకరీ మమ ||

ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ

తృతీయం శారదాదేవీ చతుర్దo హంసవాహనా ||

పంచమం జగతీ ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా

కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ ||

నవమం బుద్దిథాత్రీ చ దశమం వరదాయినీ

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ||

బ్రాహ్మీద్వాదశనామాని త్రిసంధ్యo యః పఠేన్నరః

సర్వసిద్దికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి

సామే వసతు జిహ్వగ్రే  బ్రహ్మరూపా సరస్వతీ ||