తల్లి : మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి, ఆమె గొప్ప త్యాగమూర్తి, మనం జన్మించాలంటే ఆమె మరణం దాకా వెళ్ళాలి ఇలా జరగటం మొదటి అద్భతం
తండ్రి : మన సుఖం కోసం అహర్నిశలూ శ్రమించే శ్రమ జీవి, కుటుంబ వృద్ధి కోసం తను వ్రుధాప్యం వరకు కష్ట పడే కష్ట జీవి లోకానికి మన శక్తి యుక్తులను పరిచయం చేసిన తొలి గురువు ఇలాంటి గురువును పొందటం రెండవ అద్భుతం
తోబుట్టువులు : మనతో అల్లరి చేయటానికి, మన తప్పులు కాయటానికి, అమ్మకు నాన్నకు మనగురుంచి పైరవిలు జరపటానికి, కష్ట సుఖాలలో నేనున్నాను అని ధైర్యం చెప్పే తోబుట్టువులే మూడవ అద్భతం
స్నేహితులు : మనచుట్టు ఆ భగవంతుడు సృష్టించిన నాల్గువ అద్భుతమే ఈ స్నేహితులు, ఎన్నో సమస్యలు, కష్టములు ఉన్న, ఏది ఆశించకుండా మనకు సరైన సలహా ఇచ్చేవారు స్నేహితులు
భార్య/భర్త : పవిత్ర వివాహ బంధం ద్వారా ఆడ, మగ వారు భార్య, భర్తలుగా మారతారు కదా, ఈ ఒక్క బంధం కోసం స్త్రీలు అందరు తమ వారందరిని వదులుకొని కల కాలం తోడు కోసం ఒక్కటిగా చేస్తుంది. పిల్లల వృద్ధి కోసం ఎంతటి త్యాగనికైన సిద్దమైయే లా చేస్తుంది అంత గొప్ప బంధం తో ఏకమైన భార్య, భర్తలే ఐదవ అద్భతం
పిల్లలు : తమ పిల్లలు బాగుండాలి, మంచి కాడువులు చదవాలి, ఉన్నత ఉద్యోగాలు చేయాలి అని తల్లి తండ్రులు కోరుకొంటారు, పిల్లల కోరికలు నేరవేర్చటానికి తల్లి తండ్రులు ఎన్నోత్యాగాలు చేస్తారు, ఇలా త్యాగాలు చేయటం కుడా ఒక అద్భుతమే.
మనవళ్ళు మనవరాళ్ళు : భగవంతుడు వీరో కోసం ఇంకొన్ని రోజులు ఆయు ఆరోగ్యాలు ఇస్తే బాగుండును అనిపిస్తుంది. తమ వస్సును మరచి మరీ చిన్న పిల్లలా ఆడుకోవటం ఒక అద్భుతమే.
ప్రకృతి : ధర్మో రక్షితి రక్షితః అన్నట్టు ప్రకృతి ని కాపాడుకొంటూ, ప్రకృతి మాత ఒడిలో ఆడుకొంటూ, ప్రకృతిని ఆస్వాదించటం కుడా ఒక అద్భుతమే.
దేవాలయం : మన ఊరిలోని గుడి, అందులో జరిగే సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే కార్యక్రమాలు, సంవత్సరానికి ఒకమారు జరిగే తిరనాళ, వేద పారాయణ, ఇవ్వన్ని చూడటానికి మరియు ఆనందించటానికి భగవంతుడు మనకు ఈ శరీరమును ఇవ్వటం మహా అద్భుతం.
ఇన్ని అద్భుతాలు మనచుట్టు ఉన్నాయి కదా, వీటిని కాదని ఎక్కడో ఏదో ఉందని, ఉరకలు, పరగులు పెట్టవలసిన అవసరము ఉందా అనిపిస్తుంది కదా!!