Gnananidhi
అపార కరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం| శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ||
అపార కరుణా సింధుం జ్ఞానతం శాంతరూపిణం| శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ||
హోలీ ప్రాముఖ్యత హోలీ పండగ: భారతదేశంలో మరియు ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. దీనిని రంగుల పండుగ లేదా ప్రేమ పండుగ అని కూడా అంటారు. హోలీ ఎందుకు ముఖ్యమైనదో ఇక్కడ కొన్నికారణాలు ఉన్నాయి: ప్రజలను ఏకతాటిపైకి తెస్తుంది: హోలీ అనేది విభిన్న నేపథ్యాలు మరియు వర్గాల ప్రజలను ఒకచోట చేర్చే పండుగ. ప్రజలు తమ విభేదాలను మరచి ప్రేమ మరియు ఆనందంతో కలిసి జరుపుకునే సమయం ఇది. వసంత రాకను…
శ్రీ మహ గణాధిపతాయే నమ: మన పురాణాల ప్రాకారము గణపతి ని విజ్ఞాలు తొలగించే దైవం గా పూజిస్తాము. అట్టి వినాయకునకు నెలలో రెండు రోజులు అత్యంత ఇష్టమైనవి, అవే అమావాస్య తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దేన్నే వరద చతుర్ధి అని, రెండవది పౌర్ణమి తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దీన్నే సంకష్టహర చతుర్ధి అని అంటారు. భాద్రపదమాసము లో వచ్చే చవితి ని (శ్రావణ అమావాస్య తరువాత) వినాయక చవితి అంటారు. ఇక ప్రతి…
మన సనాతన ధర్మం లో ప్రతి మాసానికి ఒక ప్రత్యకత ఉన్నది. చైత్ర మొదలు ఫాల్గుణం వరకు ప్రతి మాసం యందు విశేష తిధులు (రోజులు) ఉన్నాయి. కార్తిక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత మాఘ మాసానికి ఉంది. ధ్యానం మనస్సు ను శుద్ధి చేస్తే స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. కార్తీక మాసములో దీపారాధనకు ఒక ప్రత్యేకత ఉంది, అదే ఈ మాఘ మాసంలో స్నానమునకు ప్రత్యేకత ఉంది. సంకల్ప సహితంగా నదీ…
ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు పెద్దలు. అంటే ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి అని భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సుర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. మఘమాసం శుక్లపక్షములో సప్తమి తిదినాడు ఈ పర్వదినం వస్తుంది. దీనినే రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్యుడు ఏడు గుఱ్ఱాల రథంపై దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు కు ప్రయాణం చేస్తాడు. ఇంకో విషయం ఏమిటంటే సూర్యని రధానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది. ఆరు…
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరుపిణి విధ్యారంభం కరిష్యామి సిద్ది: ర్భవతుమే సదా మనకు ఏది కావాలన్న, ఏది సాధించాలన్న, ఏ మార్గాన్ని చేరాలన్న జ్ఞానం అన్నది చాలా ముఖ్యం, జ్ఞానార్జన కొరకు మానవలు, మునులు, ఋషులు, దేవతలు ఒక్కమాటలో చెప్పాలంటే సమస్త బ్రహ్మాండం నిత్యం సాధన చేస్తూనే ఉంటారు.ఆది మానవుడు నుండి నేటి ఆధునిక మానవుడి వరకు నిత్యం జ్ఞానార్జన కొరకు శ్రమించాల్సిందే (కోటి విద్యలు(జ్ఞానం) కూటి కొరకు), ధనార్జన చేయాలంటే ఖచితంగా జ్ఞానార్జన చేయవసిందే. జ్ఞానార్జన…
కలియుగం లో మానవులు చేసిన పాపాలు అన్నింటిని హరించే శక్తి ఆ శ్రీ హరి కి ఉన్నది. ఆ ఆపద మొక్కులవాడు మన ఆపదలను తొలగించి మనలోని చక్రాలను ఉత్తేజ పరిచి, మన ఆలోచనలను సక్రమ మార్గములో పెట్టి మన ఆపదలను తొలగిన్చటానికి ఈ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ చాలా ఉపయోగ పడుతుంది అనుటలో అతిశయోక్తి లేదు నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం| ప్రపధ్యే వేంకటేశాఖ్యం తదేవకవచం మమ|| 1 …
మనలో ఎవరు భాగ్యవంతులు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు అని చెప్తారు అంటే “ఆరోగ్యమే మహాభాగ్యం”, అటువంటి మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే నిత్యం ఉదయానేయోగ చేస్తారు, వాకింగ్ చేస్తారు, వ్యాయామం చేస్తారు, మరి కొందరు ఆ ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవాన్ ని ఆదిత్య హృదయం తో పూజించి మంచి ఆరోగ్యాన్నిపొందుతారు. నిత్యం ఈ ఆదిత్యహృదయాన్ని చదవటం వలన మంచి ఆరోగ్యం తో పాటు, ఉద్యోగం లో ఉన్నత అధికారుల అనుగ్రహం కూడ పొందుతారు, కంటి సమస్యలు…