చెన్నకేశవాలయం మార్కాపురం . Chennakesava Temple Markapuram
ఆంధ్రరాష్ట్రమందలి ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణ మందు ప్రాచీన ప్రముఖ చెన్నకేశవ ఆలయము గలదు .కేశి అను రాక్షస సంహారానంతరం శ్రీమహావిష్ణువు శ్రీ ,భూ సమేతంగా చెన్నకేశవుడుగా ఇచట కొలువుదీరియున్నాడు.చెన్న అనగా అందమైన ఇచట చక్కని స్వామికి సార్ధకనామము .
1409- 1459 మధ్య ఏలిన విజయనగర సామ్రాజ్య పాలకుడు కృష్ణదేవరాయలు అంతరాలయమును నిర్మించగా 1837 లో వెలుపలినిర్మాణము జరిగినట్లు చెపుతారు . ఈ ఆలయ నిర్వహణ కు 355 ఎకరముల భూమిని ఈనాముగా ఇచ్చారని శాసనము చెపుతుంది .135 అడుగులఎత్తైన గాలిగోపురము అత్యంత సుందరము గానుండి ఐదు కి.మి దూరమువరకు కనపడును . ఇచటి మరొకవిశేషము చక్కనిశిల్పకళతోకూడి శ్రీకృష్ణుడు ఆంజనేయుడు వినాయకుడు ఇతర దేవీదేవతలు వారి వాహనములు కూడిన శిల్పములు చెక్కబడి యుండును . 40 రాతిస్తంభముల మంటపము .కల్యాణ మంటపమున గల ఆరు స్తంభములు తాకినంతనే ప్రత్యేకముగా ఆరోహణ అవరోహణతో సంగీతపు సప్తస్వరములు పలుకుతాయి .
ఏటా డిశంబరు 16 నుండి జనవరి 14 వరకు 20 నిముషాలపాటు సూర్యకిరణములు ఒక గవాక్షం గుండా ప్రసరించి స్వామి పాదములపై వెలుగుట ఇచట మరొక విశేషము.
.