Nithya Pooja Vidhanam

Nithya Pooja Vidhanam

“నిత్య పూజ” అనేది హిందూ మతంలో వ్యక్తులు లేదా కుటుంబాలు నిర్వహించే రోజువారీ ఆచార ఆరాధన. ఇది దైవంతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు భక్తి మరియు కృతజ్ఞతలను వ్యక్తపరచడానికి ఒక మార్గం.  ఇక్కడ నిత్య పూజ ఎలా చేయాలి ఇంట్లో ఎవరు చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం:

ప్రతి రోజు సుర్యోదయమునకు ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని. ఇంటి గదులను, దేవుడి గదిని శుభ్ర పరచి స్నాదికాలు పూర్తి చేసుకోవాలి.

ధ్యానమనేది దేహమును శుభ్ర పరిస్తే స్నానము శరీరాన్ని శుభ్ర పరుస్తుంది

ఆ తరువాత  శుభ్రమైన బట్టలు ధరించి, ప్రశాంత మనస్సుతో పూజ గదిలోని ఫోటో లేదా విగ్రహాల పైన ఉంచిన పూలను, దండలను తీసి వేయాలి. పూజ కోసం అవసరమైన వస్తువులను  అనగా, పసుపు, కుంకుమ, దీపారాధనకు ఒఒతులు, ఆవు నెయి లేదా నువ్లువుల నూనె, మన ఆచమనానికి ఒక పంచపాత్సేర, దేవుని ఉపచారములకు ఒకపంచపాత్ర, పూజకు పూలు, నైవేద్యం కు పండ్లు, లేదా శుచిగా వండిన ఆహారము,  ధూపం,  మరియు నీరు.

పూజకు ముందర దీపారాధన వెలిగించి, గణపతిని ప్రార్ధించి మీ ఇంటి ఇలవేల్పును, ఇష్ట దేవతకు లేదా ఏవరిని పూజించాలో వారికి  షోడశోపచారాలు చేయాలి.

షోడశోపచారాలు ధ్యానం, అవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం,, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం/నమస్కారం

దేవునికి పుష్పములు పెట్టిన తరువాత  ఏ దేవుని ని పూజించాలో వారికి సంబందించిన అష్టోత్రం చదవాలి ఆ తరువాత మిగిలిన ఉపచారాలు అంటే ధూపం,, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం/నమస్కారం చేయాలి. ఇలా రోజు చేస్తే దానిని నిత్య పూజ అంటారు.

వివిధ హిందూ సంప్రదాయాలు, శాఖలు లేదా ప్రాంతాల మధ్య నిర్దిష్ట పద్ధతులు, ఆచారాలు మరియు ప్రార్థనలు మారవచ్చునని గమనించడం ముఖ్యం. అందువల్ల, వ్యక్తిగత ప్రాధాన్యతలు లేదా అనుసరించే నిర్దిష్ట ఆచారాలపై ఆధారపడి పూజ యొక్క వివరాలు మరియు క్రమం కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *