ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు పెద్దలు.
అంటే ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి అని భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సుర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. మఘమాసం శుక్లపక్షములో సప్తమి తిదినాడు ఈ పర్వదినం వస్తుంది. దీనినే రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్యుడు ఏడు గుఱ్ఱాల రథంపై దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు కు ప్రయాణం చేస్తాడు. ఇంకో విషయం ఏమిటంటే సూర్యని రధానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది. ఆరు కిరణాలతో ఏడు అశ్వాలతో సంచరిస్తాడు, ఈ ఆరు కిరణాలే మనకు ఆరు రుతువులుగా ఉన్నాయి (వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర), రధ సారధి పేరు అరుణుడు.సూర్యని తల్లితండ్రులు అతిధి, కశ్యపుడు (కశ్యపుడు సంచరించినప్రదేశమే ప్రదేశమే నేటి కాశ్మీర్)భార్య పేరు ఉష, ఛాయ సూర్యుని కుమారులే యముడు, శనీశ్వరుడు. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగ పరిగణిస్తారు. సూర్యుని ఏడు గుఱ్ఱాల పేర్లు: గాయత్రి, త్రిష్ణప్, జగతి, అనుష్టుప్, బృహతి, పంక్తి, ఉష్ణిక్క్. మన భారతీయులు వేద కాలంలో ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారిని ఒకొక్కమాసంలో ఒకొక్క పేరుతో పిలుస్తారు. వారి పేర్లు వరుసగా: మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. సూర్యుని యొక్క ప్రయాణం మేష రాశి నుంచి మీన రాశి వరకు వున్న ద్వాదశ రాశులలో ఒకొక్కమాసములలో ఒకొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు.
ఈ రధ సప్తమినాడు ఆకాశంలో ప్రముఖ నక్షత్రాలు రధము ఆకారంలో కనపడతాయి. మాఘమాసంలో సూర్యుడు అర్క అనే నామంతో సంచరిస్తాడు. అందుకే సూర్యునికి అర్కపత్రం (జిల్లేడు ఆకు) అంటే చాలా ఇష్టం. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. . సూర్యునిలో వుండే ఒక శక్తి అర్క పత్రంలో ఉంది. అందుకే రథసప్తమి రోజు సప్త అశ్వములకు చిహ్నంగా శరీరంఅనే రధం ఫై ఏడు జిల్లేడు ఆకులను ఉంచి ఏదేని నదిలో స్నానం లేదా కుదరని పక్షం లో చెరువులో గాని అది కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. జిల్లేడు ఆకులు దొరకనిచో చిక్కుడు ఆకులుగాని లేదా రేగి ఆకులుగాని శ్రేష్టo. ఈ ఆకులను శిరస్సు మీద ధరించి తల స్నానం చేయడం వలన సూర్యుని యొక్క తేజస్సు మనకు లభిస్తుంది అని పెద్దల మాట.
తరతరాలుగా మన భారతీయులు సంప్రదాయoని అనుసరిస్తూ చిక్కుడు ఆకులతో, కాయలతో రధాన్ని చేసి చిక్కుడు ఆకు మీద గాని తమలపాకు మీద గాని ఎర్ర చందనంతో సూర్య బింబాన్ని చేసి దానియందు సుర్యభాగావనున్ని ఆవాహన చేసి ఆరాదించాలి. ఇటువంటి పర్వదినాన ఎటువంటి కార్యక్రమం చేపట్టిన విశేషమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు నోములు పట్టుటకు ఈ రోజు ఎంతో మంచిది.
అందరి అభిష్టలను నెరవేర్చే ప్రత్యక్షదైవం శ్రీ సూర్యనారాయణ స్వామి. సూర్యోదయానికి 48 నిమిషాల ముందు తనని మందేహులని రాక్షసులు అడ్డుకొంటుటారు ఆ సమయo లో ఎవరు సంద్యావందనం, ఆదిత్య హృదయం చదువుతారో లేక కనీసం నాలుగు సార్లు నీళ్ళ తొ అర్ఘ్యం ద్వారా శక్తిని ఇస్తారో స్వాఅట్టి వారికి సర్వ రోగాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఆయన యొక్క అనుగ్రహం మనపై వుండాలని కోరుతూ, రధసప్తమి రోజున పాఠించవలసిన స్తోత్రములు : సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పారాయణం
సూర్యాష్టకంశ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి సూర్యాష్టకం
ఆదిత్య హృదయం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి ఆదిత్యహృదయం