సంకష్ట చతుర్ధి

శ్రీ మహ గణాధిపతాయే నమ:

మన పురాణాల ప్రాకారము గణపతి ని విజ్ఞాలు తొలగించే దైవం గా పూజిస్తాము. అట్టి వినాయకునకు నెలలో రెండు రోజులు అత్యంత ఇష్టమైనవి, అవే అమావాస్య తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దేన్నే వరద చతుర్ధి అని, రెండవది పౌర్ణమి తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దీన్నే సంకష్టహర చతుర్ధి అని అంటారు. భాద్రపదమాసము లో వచ్చే చవితి ని (శ్రావణ అమావాస్య తరువాత) వినాయక చవితి అంటారు. ఇక ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్ధి నాడు గణపతి ని విశేషముగా పూజిస్తారు.

మన పురాణాల ప్రాకారము గణపతి ని విజ్ఞాలు తొలగించే దైవం గా పూజిస్తాము. అట్టి వినాయకునకు నెలలో రెండు రోజులు అత్యంత ఇష్టమైనవి, అవే అమావాస్య తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దేన్నే వరద చతుర్ధి అని, రెండవది పౌర్ణమి తరువాత వచ్చే చవితి (చతుర్ధి) దీన్నే సంకష్టహర చతుర్ధి అని అంటారు. భాద్రపదమాసము లో వచ్చే చవితి ని (శ్రావణ అమావాస్య తరువాత) వినాయక చవితి అంటారు. ఇక ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్ధి నాడు గణపతి ని విశేషముగా పూజిస్తారు.

ప్రదోష కాలంలో (సూర్యాస్తమయ సమయములో) చవితి తిధి ఎప్పుడు వుంటుందో ఆరోజును సంకష్టహర చతుర్ధి గా పరిగణిస్తారు. ఎప్పుడైన ఒకసారి రెండు రోజుల్లో (తదియ, చవితి) ప్రదోష కాలంలో (సూర్యాస్తమయ సమయములో) చవితి ఉంటె రెండో రోజున సంకష్ట చతుర్ధి ని జరుపికోవాలి. అదే మంగళవారం తో కూడిన సంకష్టహర చతుర్ధి మరీ విశేషం దీన్నే అంగారక చతుర్ధి అని కూడా అంటారు.

గణేశ పురాణం ప్రకారం గణేశుడు సకల భయ నివారకుడు కుజ దోషము ఉన్నవారు గణపతి ని పూజించిన కుజ దోష నివారణ జరుగును, సర్వ పాపములు తొలగును. ఎవరికైతే పనులు ముందుకు సాగక, ఆలోచనలు నిలకడగా ఉండవో అట్టివారు ఈ సంకష్టహర చతుర్ధి రోజున గణపతిని తమ శక్తి కొద్ది పూజిస్తారో వారికీ గణపతి ముందుండి అన్ని సమస్యలను తీరుస్తాడు.

        సంకష్టహర చతుర్ధి రోజున ఉదయాన్నే (సుర్యోదయమునకు ముందు) నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నానము చేసి నిత్య పూజను చేసుకోవాలి. పగటిపూట ఉపవాసము ఉండాలి. అల్పాహారము కాని పండ్లు కాని తినవచ్చు.   ప్రదోష కాలములో మట్టితో కాని పసుపుతో కాని గణపతి ని ఇంట్లో ఉంచి షోడశోపచారాల తో యధావిధిగా పూజ చేయాలి, ఆ తరువాత గణపతికి ఇష్టమైన దుర్వయుగ్మములతో (గరిక) పూజించాలి. తెల్ల జిల్లేడు పూలతో అష్తోత్రం కాని,

లేదా సాహస్రనామార్చన కాని చేయాలి కనీసము సంకటనాశన గణపతి స్తోత్రంని చదవాలి, నైవేద్యం గా కుడుములు, ఉండ్రాళ్ళు, దానిమ్మ పళ్ళు, పాయసాన్నము పెట్టాలి, చంద్రోదయం అయిన తరువాత నక్షత్రాలు చూసి భోజనం చేయాలి.  పూజ చేయటం రాని వారు ఒక బ్రాహ్మణుడు తో పూజ చెయిన్చుకోవచ్చును, ఇంట్లో కుదరని వాళ్ళు గుడి లో నయన చేఇంచుకోవచ్చును. రాత్రింతా జాగారము చేయాలి. ఇలా చేయలేని వారు కనీసము ఉపవాసము ఉండి గణపతి ఫోటో దగ్గర కూర్చుని సంకటమోచన సంకల్పం చెప్పుకొని గణపతి స్తోత్రం చదివి రాత్రి జాగారం చేయాలి.

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన……..సంవత్సరే….అయనే….ఋతౌ…..మాసే, శుక్ల/కృష్ణ పక్షే ….తిథౌ….వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్….గోత్రః …..నామధేయోహం, మమ ధర్మ పత్నీసమేతస్య, సహా కుటుమ్బానాం క్షేమ, స్తేర్య, విజయ, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యవ్రుధ్యర్థం, భగవంతం శ్రీ లక్ష్మీగణపతి స్వామి దేవత ప్రీత్యర్ధం గణపతి పూజాం కరిష్యే (నీరు ముట్టుకోవలెను) అని చెప్పుకోవాలి

గమనిక: సంకల్పం ఆయా కుటుంబ వేదములను బట్టి మరియు కటుంబ ఆచార సంప్రదయలను బట్టి మారును.

        ఈ పూజ చేయుట వలన సంతానము లేని వారికి సంతానము కలుగును, దరిద్రులు ధనవంతులవుతారు,అనారోగ్యులు ఆరోగ్యవంతులవుతారు, విద్యార్ధులకు మంచివిద్యాబుద్ధులు వస్తాయి, పాపాత్ములు పుణ్యాత్ములు అవుతారు, చివరకి గణేశ లోకానికి వెళ్తారు.

సంకట మోచన గణపతి స్తోత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు    సంకట నాశన గణపతి స్తోత్రం

గణపతి అష్టోత్రం కోసం క్లిక్ చేయండి