శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం

కుటుంబంలో అప్పుడప్పుడు ఏదో కారణం చేత గొడవలు అవుతుంటాయి. అలాగే తాడును చుసిన పాము ల బ్రమించడంకొందరికి జరుగుతూ ఉంటుంది. ఎంతో ఇష్టపడి వివాహము చేసుకొని కొంతకాలం సక్రమంగా కాపరం చేసి ఆ తరువాత విడిపోయిన వారు ఈ సమాజంలో మనకు ప్రత్యక్షం అవుతుంటారు. భర్త లేక భార్య సరిగా ఉండటం లేదని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అన్నధలగా మార్చిన వారు ఉన్నారు దీనికంతటి కారణం ఒకరంటే ఒకరికి నమ్మకం, ప్రేమ లేకపోవటమే. జాతకంలో సర్పదోషం ఉన్న లేక రాహు కేతు దోషాలు ఉన్న, లేని దాన్ని ఉన్నదిగా భావిస్తున్న తప్పకుండ శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. మరి ముఖ్యముగా భార్య, భర్తల మధ్య గొడవలు లేకుండా చిలక గోరింక ల వలె ఉండాలన్న తప్పకుండ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని విధిగ ఆరాదించాలి. ఇవరికైతే ఇలాంటి సమస్యలు ఉంటాయో వారు తమ శక్తి మేర వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కాని, ప్రతి మంగళవారం, ఆదివారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికీ ఆవు పాలతో అభిషేకం చేయిoచుకోవాలి.  ప్రతి మంగళవారం, ఆదివారం నాడు రావి చెట్టు దగ్గర ఉన్న సర్ప ప్రతిమలకు పాలు పోసి, మంచి నీళ్ళ తో శుబ్రం చేసి పసుపు, కుంకుమ, ఎర్రని పూలతో అలంకరించాలి కుదిరితే ఎర్రని వస్త్రాలను పేద వారికీ దానం చేయాలి. ఇలా ఆడవారు, మగవారు కూడా చేయవచ్చు. దంపతులు చేసిన యడల తొందరగా మనస్పర్ధలు తొలగును. ప్రతి రోజు స్వామి వారి ఫోటో దగ్గర ఈ శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం ను చదవటం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు చివరిగా ఒక్క విషయం చెపుతాను బ్రహ్మ దేవుడు రాసిన రాతను కూడా మార్చే వరంను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మాత్రమే ఉంది.

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామ స్తోత్రమహమంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిధ్యర్దే జపే వినియోగః

ధ్యానం : షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం  చిత్రాంబరాలంకృతం | శక్తిం వజ్ర మసిం త్రిశూల మభయం ఖేటం ఫను శ్చక్రకమ్ || పాశం కుక్కుట మంకుశం చ వరదం హస్తైర్దధానం సదా | ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ || ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయం స్కంద ఏవ చ | అగ్నిగర్భ స్తృతీయస్తు బాహులేయ శ్చతుర్దకః || గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠ శ్శరవణొద్భవః | సప్తమః కార్తికేయ శ్చ కుమార శ్చాష్టమం స్తథా || నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశ | ఏకాదశ శ్చ సేనాని గుహో ద్వాదశ ఏవ చ || త్రయోదశో బ్రహ్మచారీ శివతేజ శ్చతుర్దశః | క్రౌoచదారీ పంచదశః షోడశ శ్సిఖివాహనః || షోడశైతాని నామాని యో జపే ద్భక్తి సంయుతః | బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణ స్సమః || కన్యార్ది లభతే కన్యాం జ్ఞానార్ధీ జ్ఞానమాప్ను యాత్ | విద్యార్ధీ లభతే విద్యాం ధనార్ధీ ధనమశ్ను తే | యద్య త్ప్రార్ధయతే మర్త్యః తత్సర్వం లభతే ధ్రువమ్ ||

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి